కేయూ పీహెచ్‌డీ అడ్మిషన్ల నోటిఫికేషన్‌ విడుదల

ABN , First Publish Date - 2022-05-20T05:33:16+05:30 IST

కేయూ పీహెచ్‌డీ అడ్మిషన్ల నోటిఫికేషన్‌ విడుదల

కేయూ పీహెచ్‌డీ అడ్మిషన్ల  నోటిఫికేషన్‌ విడుదల

  జూన్‌ 10 వరకు దరఖాస్తుకు గడువు 

 నాలుగేళ్ల నిరీక్షణకు తెర

కేయూ క్యాంపస్‌, మే 19: కాకతీయ యూనివర్సిటీలో పీహెచ్‌డీ అడ్మిషన్ల నోటిఫికేషన్‌ను ఎట్టకేలకు విడుదల చేశారు. ఈ మేరకు గురువారం రాత్రి కేయూ రిజిస్ట్రార్‌  బైరు వెంకట్రామిరెడ్డి కేటరిగి-2 నోటిఫికేషన్‌ షెడ్యూల్‌ను విడుదల చేశారు. మే 20 నుంచి జూన్‌ 10వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని, జూన్‌ 17 వరకు రూ.500 అపరాధ రుసుంతో దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం ఉందని రిజిస్ట్రార్‌ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు ఫీజు రూ.వెయ్యి, జనరల్‌ అభ్యర్థులు రూ.1500 చెల్లించాలని పేర్కొన్నారు. 2017 నుంచి 20 20-21 అకడమిక్‌ ఇయర్‌కు అడ్మిషన్ల చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఆర్ట్స్‌, కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, ఎడ్యుకేషన్‌, ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, లా, ఫార్మసీ, సైన్స్‌, సోషల్‌ సైన్స్‌ సబ్జెక్టులలో ప్రవేశాలు కల్పిస్తామని వె ల్లడించారు. పీహెచ్‌డీ ప్రవేశాలపరీక్షలు రాసేందుకు ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు 50 శాతం మార్కులు, జనరల్‌ అభ్యర్థులు 55శాతం పీజీ కోర్సుల్లో పొంది ఉండాలని తెలిపారు. పీజీ పూర్తి చేసిన అభ్యర్థులే ప్రవేశ పరీక్ష రాసేందు కు అర్హులని తెలిపారు. అభ్యర్థులు వారి సబ్జెక్టులలో 100 మార్కులకు 90నిమిషాల్లో మల్టీపుల్‌ చాయి్‌సలో ప్రవేశ ప రీక్షలు రాయాలని, పరీక్షల్లో వచ్చిన మెరిట్‌ ఆధారంగా ప్ర వేశాలు కల్పిస్తామని వెల్లడించారు. దరఖాస్తులు కేయూ డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిషన్ల కార్యాలయంలో అందచేయాలని కోరారు. సిలబస్‌, హాల్‌టికెట్‌లతో పాటు ఇతర వివరాల కోసం ఠీఠీఠీ.జ్చుజ్చ్టుజీడ్చ.్చఛి.జీుఽసైట్‌ చూడాలని రిజిస్ట్రార్‌ కోరారు.  

సబ్జెక్టుల వారీగా ఖాళీలివే..

ఇంగ్లీష్‌-7, తెలుగు 11, కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌-18, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ 3, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ 11, సివిల్‌ ఇంజనీరింగ్‌ 6, ఎలక్ర్టానిక్స్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ 12, ఎలక్ర్టానిక్‌ ఇస్ట్రూమెంటేషన్‌ ఇంజనీరింగ్‌ -4, మెకానికల్‌ ఇంజనీరింగ్‌ 14, లా 4, పార్మసీ 27, బయోటెక్నాలజీ 3, కెమిస్ట్రీ 7, కంప్యూటర్‌ సైన్స్‌ (ఎంసీఏ)6, జియాలజీ 2, మ్యాథ్స్‌-12, మైక్రోబయోలజీ-7, ఫిజిక్స్‌ 6, జువాలజీ -18, స్టాట్స్‌ 1, ఎకానమిక్స్‌-2, హిస్టరీ అండ్‌ టూరిజం మేనేజ్‌మెంట్‌-8, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, హ్యుమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మె ట్‌-, పొలికల్‌సైన్స్‌- 10, సోషల్‌వర్క్స్‌, సోషియాలజీ 4 ఖాళీలున్నాయని రిజిస్ట్రార్‌ బైరు వెంకట్రామిరెడ్డి తెలిపారు. 

Updated Date - 2022-05-20T05:33:16+05:30 IST