బండి సంజయ్‌కు కేటీఆర్ సవాల్
ABN , First Publish Date - 2022-03-17T20:54:33+05:30 IST
బీజేపీ నేత బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. కరీంనగర్ జిల్లాలో కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

కరీంనగర్: బీజేపీ నేత బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. కరీంనగర్ జిల్లాలో కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి గంగుల కమలాకర్‌పై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. తెలంగాణకు కేంద్రం ఏం అభివృద్ధి చేసింది? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం బండి సంజయ్ ఏనాడైనా కేంద్రాన్ని అడిగారా అని నిలదీశారు. హిందూ ముస్లిం పంచాయతీ తప్ప సంజయ్‌కు ఏమీ రాదని ఎద్దేవాచేశారు. కరీంనగర్‌కు కనీసం ఓ గుడి అయినా తెచ్చావా అని ప్రశ్నించారు. మూడేళ్లలో మతం పిచ్చి కడుపు నింపదని, బండి సంజయ్ యువతను చెడగొడుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు.