జనవరి 6న కృష్ణాబోర్డు సమావేశం

ABN , First Publish Date - 2022-12-16T03:14:15+05:30 IST

హైదరాబాద్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) 17వ సమావేశం జనవరి 6న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని జలసౌధలో జరుగనుంది. ఈ సమావేశంలో ఇటీవలే బోర్డుకు చెందిన రిజర్వాయర్‌ మేనేజ్‌మెంట్‌

జనవరి 6న కృష్ణాబోర్డు సమావేశం

హైదరాబాద్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) 17వ సమావేశం జనవరి 6న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని జలసౌధలో జరుగనుంది. ఈ సమావేశంలో ఇటీవలే బోర్డుకు చెందిన రిజర్వాయర్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ(ఆర్‌ఎంసీ) సమర్పించిన నివేదికతో పాటు గెజిట్‌ అమలు, సీడ్‌మనీ, రెండోదశ టెలిమెట్రీ కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించనున్నారు. ఈ మేరకు తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు సమాచారం అందించింది. రాష్ట్రాల వారీగా చర్చించే అంశాలు ఏమైనా ఉంటే ఎజెండాను ఈనెల 26లోపు పంపించాలని నిర్దేశించింది. మరోవైపు గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ) సమావేశం కూడా జనవరి 3న ఉదయం 11 గంటలకు జరుగనుంది.

Updated Date - 2022-12-16T03:14:16+05:30 IST