కొత్తగూడెం జిల్లాలో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్..

ABN , First Publish Date - 2022-06-28T04:02:40+05:30 IST

పినపాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కీలక వ్యాఖ్యలు చేశారు. భద్రాచలం కాంగ్రెస్ల ఎమ్మెల్యే పోదెం వీరయ్యను ఉద్దేశించి...

కొత్తగూడెం జిల్లాలో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్..

భద్రాద్రి: పినపాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్  రేగా కాంతారావు కీలక వ్యాఖ్యలు చేశారు.  భద్రాచలం కాంగ్రెస్ల ఎమ్మెల్యే పోదెం వీరయ్యను ఉద్దేశించి రేగా కాంతారావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొత్తగూడెం జిల్లాలో 5 నియోజకవర్గాలతో పాటు పాత నియోజకవర్గం ములుగు సంగతి కూడా చూస్తానని రేగా కాంతారావు హెచ్చరించారు.  వీరయ్య.. ఓటమి ఖాయమని.. మరో నియోజకవర్గం చూసుకోవాలంటూ సూచించారు. 2023 ఎన్నికల తర్వాత వీరయ్య అడ్రస్ ఎక్కడో చూద్దామంటూ వ్యాఖ్యానించారు. 


అయితే రేగా కాంతారావుకు పోదెం వీరయ్య సవాల్ విసిరారు. కొత్తగూడెం జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో రేగాను గెలవనివ్వమన్నారు. భారీ మోజార్టీతో రేగా కాంతారావును ఓడిస్తానని పోదెం వీరయ్య వ్యాఖ్యానించారు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.  

Updated Date - 2022-06-28T04:02:40+05:30 IST