ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలి

ABN , First Publish Date - 2022-10-17T06:02:41+05:30 IST

ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలి

ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలి
బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు చిన్నాను అభినందిస్తున్న కొండేటి శ్రీధర్‌

రాష్ట్ర, జిల్లా శాఖ కార్యక్రమాలను అమలు చేయాలి
బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్‌
వరంగల్‌ సిటీ, అక్టోబరు 16: రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలను, అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను బీజేవైఎం నాయకులు, యువత ఎండగట్టాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌ పిలుపునిచ్చారు. వరంగల్‌ శివనగర్‌లోని బీజేపీ జిల్లా కార్యాలమంలో ఆదివారం బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు గోదాసి రాజ్‌కుమార్‌(చిన్నా) అధ్యక్షతన జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీధర్‌ మాట్లాడుతూ పార్టీ సంస్థాగత నిర్మాణంలో యువ మోర్చా వెనుకబడిందని గుర్తు చేశారు. ఇటీవలే నియామకమైన బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు చిన్నా ఆధ్వర్యంలో పూర్తి బలోపేతం కావాలన్నారు. ఇక ముందు నుంచి ఎలాంటి లోటుపాట్లు లేకుండా రాష్ట్ర, జిల్లా శాఖ నిర్ధేశించిన కార్యక్రమాలను ఉత్సాహంగా నిర్వహిస్తూ జిల్లాకు, యువ మోర్చాకు పేరు తేవాలని సూచించారు. అలాగే ప్రభుత్వం అవలంభిస్తున్న తీరును బీజేపీ ఏ విధంగా ఎదుర్కొంటుందో ప్రజలకు అర్థమయ్యేలా ప్రచారం చేయాలన్నారు. మండల, డివిజన్‌ స్థాయిల్లో అసంపూర్తిగా ఉన్న కమిటీలను త్వరితగతిన పూర్తి చేసి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేవైఎం సత్తా చాటాలని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్ర కిసాన్‌ మోర్చా అధికార ప్రతినిధి, యువ మోర్చా ప్రభారి బండి సాంబయ్య యాదవ్‌, జిల్లా ఉపాధ్యక్షుడు కనుకుంట్ల రంజిత్‌కుమార్‌, రాష్ట్ర కిసాన్‌ మోర్చా ఉపాధ్యక్షుడు మల్లాడి తిరుపతిరెడ్డి, యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అరకట్ట ప్రవీణ్‌చౌదరి, జిల్లా కార్యదర్శులు నూనె అనిల్‌, సునిల్‌, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-17T06:02:41+05:30 IST