కొండా దంపతులనే తరిమికొట్టా.. విగ్రహం ఓ లెక్క: చల్లా ధర్మారెడ్డి

ABN , First Publish Date - 2022-01-24T00:50:15+05:30 IST

కొండా దంపతులనే తరిమి కొట్టాను.. విగ్రహం ఓ లెక్కా..’ అని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు

కొండా దంపతులనే తరిమికొట్టా.. విగ్రహం ఓ లెక్క: చల్లా ధర్మారెడ్డి

వరంగల్: ‘కొండా దంపతులనే తరిమి కొట్టాను.. విగ్రహం ఓ లెక్కా..’ అని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్‌ జాతరలో కొండా సురేఖ తనపై చేసిన వ్యాఖ్యలపై ధర్మారెడ్డి స్పందించారు. వేయి తప్పులు చేసి నాశనానికి గురైన కొండా దంపతులు.. ప్రజల చేతిలో ఇంకా నాశనం అవుతారని విమర్శించారు. సమ్మక్క- సారలమ్మ జన్మస్థానమైన ఆత్మకూరు మండలం ఆగ్రంపహాడ్‌ జాతరలో కొండా మురళి తల్లిదండ్రుల విగ్రహాలు పెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ‘నేను ఆగ్రహిస్తే దాని అడ్రస్‌ ఉండదు’ అని మండిపడ్డారు. కొండా దంపతులు నిద్రపోతున్న సింహాలు కాదని, లేవలేని స్థితిలో ఉన్నారని ఎద్దేవాచేశారు. ప్రజలు వారి ముఖం చూడడానికి కూడా ఇష్టపడడంలేదని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాతనే అభివృద్ధి జరిగిందని చల్లా ధర్మారెడ్డి తెలిపారు.

Read more