గాలిపటం మాంజా గొంతుకు చుట్టుకొని ఒకరికి గాయాలు
ABN , First Publish Date - 2022-01-16T23:52:04+05:30 IST
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఇస్లాంపురకు చెందిన ఎజాజ్ అనే యువకుడు బైక్పై వెళుతుండగా చైనా మాంజా గొంతుకు
బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఇస్లాంపురకు చెందిన ఎజాజ్ అనే యువకుడు బైక్పై వెళుతుండగా చైనా మాంజా గొంతుకు చుట్టుకొని తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికుల ప్రకారం వివరాలు.. పట్టణంలోని షేక్చాంద్ అనే యువకుడు ఆదివారం చైనా మాంజాతో గాలిపటం ఎగురవేస్తున్నాడు. ఎజాజ్ అనే యువకుడు అటువైపు నుంచి బైక్పై వెళుతుండగా చైనా మాంజా గొంతుకు చుట్టుకుని తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు హుటాహుటిన బాన్సువాడ ప్రభుత్వ ఏరియాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచనల మేరకు ఆయనను నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.