8 ఏళ్లుగా సచివాలయానికి సీఎం కేసీఆర్ రాలేదు: కిషన్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-07-04T00:57:10+05:30 IST

టీఆర్ఎస్ ఫ్లెక్సీల వార్ చేస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. బీజేపీ ఫ్లెక్సీలను కావాలని తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

8 ఏళ్లుగా సచివాలయానికి సీఎం కేసీఆర్ రాలేదు: కిషన్‌రెడ్డి

హైదరాబాద్: టీఆర్ఎస్ ఫ్లెక్సీల వార్ చేస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. బీజేపీ ఫ్లెక్సీలను కావాలని తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఫ్లెక్సీలకు భారీగా జరిమానాలు వేశారని ఆరోపించారు. టీఆర్ఎస్ ఫ్లెక్సీలపై నామమాత్రపు ఫైన్లు వేశారని చెప్పారు. ఇంత చౌకబారు రాజకీయాలు తాము ఎన్నడూ చూడలేదన్నారు. ఓవైసీ, కేసీఆర్ తెలంగాణను దోచుకుంటున్నారని ఆయ ఆరోపించారు. తెలంగాణ సర్కార్ ఎలా పనిచేస్తుందో రెండ్రోజులుగా మీరే చూస్తున్నారని అని పేర్కొన్నారు. 8 ఏళ్లుగా సచివాలయానికి సీఎం కేసీఆర్ రానేలేదన్నారు. సచివాలయానికి రాని సీఎం దేశంలో కేసీఆర్ ఒక్కరేనని మండిపడ్డారు. వాస్తు పేరుతో సచివాలయం కూలగొట్టి వందల కోట్లు వృథా చేశారని ఆరోపించారు.

Updated Date - 2022-07-04T00:57:10+05:30 IST