Delhiలో కొనసాగుతున్న కేసీఆర్ పర్యటన
ABN , First Publish Date - 2022-05-22T15:55:37+05:30 IST
ఢిల్లీ (Delhi)లో కొనసాగుతున్న సీఎం కేసీఆర్ (CM KCR) పర్యటన కొనసాగుతోంది. నేడు సీఎం కేజ్రీవాల్ నివాసానికి కేసీఆర్ వెళ్లనున్నారు.

హైదరాబాద్: ఢిల్లీ (Delhi)లో కొనసాగుతున్న సీఎం కేసీఆర్ (CM KCR) పర్యటన కొనసాగుతోంది. నేడు సీఎం కేజ్రీవాల్ నివాసానికి కేసీఆర్ వెళ్లనున్నారు. లంచ్ (Lunch) తర్వాత ఇద్దరు సీఎంలు చండీగఢ్ వెళ్లనున్నారు. రైతు ఉద్యమ సమయంలో మరణించిన.. రైతు కుటుంబాలకు పరామర్శిస్తారు. అనంతరం రైతు కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని కేసీఆర్ అందజేస్తారు. 6వందల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించనున్నారు. శనివారం ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌యాదవ్‌లతో కేసీఆర్ వేర్వేరుగా సమావేశమయ్యారు.
రాష్ట్రపతి ఎన్నికకు ప్రాంతీయ పార్టీల తరఫున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే విషయమై వారితో చర్చలు జరిపారు. రాష్ట్రపతి అభ్యర్థిగా అందరికీ ఆమోదయోగ్యమైన నేతను నిలబెట్టడం ప్రస్తుతం చారిత్రక అవసరమని ఈ సందర్భంగా వారు అభిప్రాయపడినట్లు తెలిసింది. అదే సమయంలో ఒక జాతీయ అజెండాను, దేశానికి ప్రత్యేక రాజకీయ ప్రత్యామ్నాయాన్ని కలిసికట్టుగా రూపొందించాలనే కేసీఆర్ అభిప్రాయంతో అఖిలేశ్ యాదవ్ ఏకీభవించినట్లు సమాచారం. కేసీఆర్‌ను కలిసేందుకు అఖిలేశ్‌యాదవ్ లఖ్‌నవ్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వచ్చారు. ఆయనను కేసీఆర్ స్వయంగా తన తుగ్లక్‌రోడ్ నివాసం వెలుపలికి వచ్చి పుష్పగుచ్ఛం, శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు.