ఓడిపోతారని తెలిసే.. కేసీఆర్‌ జాతీయ పార్టీ

ABN , First Publish Date - 2022-10-05T09:31:28+05:30 IST

వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయమని గుర్తించిన సీఎం కేసీఆర్‌..

ఓడిపోతారని తెలిసే.. కేసీఆర్‌ జాతీయ పార్టీ

చ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయమని గుర్తించిన సీఎం కేసీఆర్‌.. జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్‌.వి.సుభా్‌ష అన్నారు. ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ రాజకీయ నిరుద్యోగిగా మారతారని గమనించిన కేసీఆర్‌, ఆయనకు రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారని టీఆర్‌ఎస్‌ నేతలే చెబుతున్నారన్నారు. కేసీఆర్‌ ఓటు బ్యాంకు రాజకీయాలు అందరికీ తెలిసిపోయాయని, దేశంలో ఇప్పుడు ఆయనను ఎవరూ నమ్మడం లేదని సుభాష్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

Read more