మిగులు రాష్ట్రాన్ని కేసీఆర్‌ అప్పుల కుప్ప చేశారు

ABN , First Publish Date - 2022-08-21T08:40:12+05:30 IST

మిగులు బడ్జెట్‌తో మొదలైన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అప్పుల కుప్పగా మార్చారంటూ వైఎ్‌సఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల శనివారం ధ్వజమెత్తారు.

మిగులు రాష్ట్రాన్ని కేసీఆర్‌ అప్పుల కుప్ప చేశారు

రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేశారు: షర్మిల 

మక్తల్‌, ఆగస్టు 20: మిగులు బడ్జెట్‌తో మొదలైన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అప్పుల కుప్పగా మార్చారంటూ వైఎ్‌సఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల శనివారం ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలను అమలుపర్చడంలో ఘోరంగా విఫలమై, రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేశారని దుమ్మెత్తిపోశారు. ఆమె ప్రారంభించిన ప్రజాప్రస్థాన పాదయాత్ర శనివారం నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలానికి చేరింది. ఈ సందర్భంగా ఆమె ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల్లో కేసీఆర్‌ ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, రుణమాఫీ, దళితులకు మూడెకరాల భూమి, దళితుడిని ముఖ్యమంత్రి చేయడం వంటి ఎన్నో హామీలు ఇచ్చిన కేసీఆర్‌, ప్రజలను మోసం చేశారు’’ అని షర్మిల స్పష్టం చేశారు.

Updated Date - 2022-08-21T08:40:12+05:30 IST