త్వరలో సీఎంతో కలిసి యాదాద్రికి వస్తా!

ABN , First Publish Date - 2022-02-23T08:22:12+05:30 IST

ఆలయ ఉద్ఘాటనకు ముందే సీఎం కేసీఆర్‌తో కలిసి చినజీయర్‌ స్వామి యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించనున్నారా?

త్వరలో సీఎంతో కలిసి యాదాద్రికి వస్తా!

ఆలయ అర్చక బృందంతో చెప్పిన చినజీయర్‌?

యాదాద్రి, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): ఆలయ ఉద్ఘాటనకు ముందే సీఎం కేసీఆర్‌తో కలిసి చినజీయర్‌ స్వామి యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించనున్నారా? అంకురారోపణకు ముందుగానే ముఖ్యమంత్రితో కలిసి యాదాద్రికి రానున్నారా? అంటే సంబంధిత వర్గాలు అవుననే అంటున్నాయి. లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ఉద్ఘాటన నేపథ్యంలో అంకురారోపణకు ముందుగానే సీఎం కేసీఆర్‌తో కలిసి యాదాద్రి క్షేత్రాన్ని సందర్శిస్తానని చినజీయర్‌స్వామి ఆలయ అర్చక బృందానికి చెప్పినట్లు తెలిసింది. మార్చి 21 నుంచి 28 వరకు నిర్వహించనున్న మహాకుంభ సంప్రోక్షణ వైదిక పర్వాల నిర్వహణపై దేవస్థాన అర్చక బృందం ముచ్చింతల్‌లోని ఆశ్రమంలో మంగళవారం చినజీయర్‌ను కలిసి సలహాలు, సూచనలు తీసుకున్నట్లు సమాచారం. మహాకుంభ సంప్రోక్షణకు మార్చి 21న అంకురారోపణ చేయాల్సి ఉండగా, ముందుగానే సీఎంతో కలిసి అక్కడికి వస్తానని, ఉద్ఘాటన మహోత్సవ ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తానని చినజీయర్‌ చెప్పినట్లు తెలుస్తోంది.   

Updated Date - 2022-02-23T08:22:12+05:30 IST