చిన్నజీయర్‌ వల్లనే కేసీఆర్‌కు పదవీ గండం: నారాయణ

ABN , First Publish Date - 2022-03-06T00:41:29+05:30 IST

ఆధ్యాత్మిక కేంద్రాలు రాజకీయాలకు వేదికలుగా మారాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తప్పుబట్టారు.

చిన్నజీయర్‌ వల్లనే కేసీఆర్‌కు పదవీ గండం: నారాయణ

హైదరాబాద్: ఆధ్యాత్మిక కేంద్రాలు రాజకీయాలకు వేదికలుగా మారాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తప్పుబట్టారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ, రాష్ట్ర రాజకీయాలు గోపురాలు, సాధువుల చుట్టూ తిరుగుతున్నాయని విమర్శించారు. పారిశ్రామిక వేత్తలు ఆదానీ, అంబానీ వంటి కార్పొరేట్‌ శక్తుల కనుసైగల్లో రాజకీయాలు నడుస్తున్నాయని దుయ్యబట్టారు. పంజాబ్‌లో ఓట్ల కోసం డేరాబాబా అనే నరహంతకుడిని బీజేపీ జైలు నుంచి విడుదల చేయించిందని మండిపడ్డారు. దేశ, రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా చిన్నజీయర్‌ స్వామి తయారయ్యారని పేర్కొన్నారు. సాధు జంతువుగా ఉన్న చిన్నజీయర్‌ స్వామి రాజకీయ జంతువుగా మారాడని తెలిపారు. చిన్నజీయర్‌ స్వామి ఆశ్రమాన్ని రాజకీయం వేదికగా చేయడం వల్ల కేసీఆర్‌ సీఎం పదవికి ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. ఆయన పట్ల కేసీఆర్‌ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ధార్మిక సంస్థలు రాజకీయాల్లో మార్పులు చేస్తూ మేక వన్నె పులి వలే వేషాలేస్తున్నాయని మండిపడ్డారు. వీరి వల్ల రాజకీయాలు కలుషితం అవుతున్నాయని నారాయణ దుయ్యబట్టారు

Updated Date - 2022-03-06T00:41:29+05:30 IST