అబుధాబిలో కేసీఆర్‌ జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2022-02-19T07:04:40+05:30 IST

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లోని అబుధాబి నగరంలో

అబుధాబిలో కేసీఆర్‌ జన్మదిన వేడుకలు

ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి: యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లోని అబుధాబి నగరంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు జన్మదినోత్సవాన్ని టీఆర్‌ఎస్‌ అభిమానులు గురువారం రాత్రి ఘనంగా జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణ శాఖ పార్టీ అధ్యక్షురాలు, మున్సిపల్‌ వైస్‌ చైర్‌ పర్సన్‌ చల్లా శ్రీలత కేట్‌ కట్‌ చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ స్వదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ కేసీఆర్‌ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే ఎస్‌. సైది రెడ్డి చొరవతో అబుధాబిలో పని చేసే విజయ భాస్కర్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. 


Read more