కర్నాటక ప్రమాద ఘటనలో మృతదేహాలు బంధువులకు అప్పగింత

ABN , First Publish Date - 2022-06-05T14:50:30+05:30 IST

కర్నాటక ప్రమాద ఘటనలో మృతదేహాలను బంధువులకు అప్పగించారు. మృతులు అర్జున్‌, సరళ, విహాన్‌, అనిత మృతదేహాలు బంధువులకు అప్పగించారు.

కర్నాటక ప్రమాద ఘటనలో మృతదేహాలు బంధువులకు అప్పగింత

హైదరాబాద్: కర్నాటక ప్రమాద ఘటనలో మృతదేహాలను బంధువులకు అప్పగించారు. మృతులు అర్జున్‌, సరళ, విహాన్‌, అనిత మృతదేహాలు బంధువులకు అప్పగించారు. మే నెల 28న సికింద్రాబాద్‌ రిసాలబజార్‌ బంజారా నగర్‌కు చెందిన అర్జున్‌కుమార్‌ తనతో పాటు 26 మంది కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి విహారయాత్రకు గోవా వెళ్లారు. విహార యాత్రను ముగించుకొని జూన్‌ 2న నగరానికి తిరిగి వస్తుండగా కర్ణాటకలోని కాలబురిగీలో అర్ధరాత్రి సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అర్జున్‌ కుమార్‌ (36), సరళ (34), అనిత (58), రవళి (32), శివ (38), వివాన్‌ (3), దీక్షిత్‌ (9) ప్రమాదంలో మృతి చెందారు. 

Updated Date - 2022-06-05T14:50:30+05:30 IST