దత్తపుత్రిక వ్యవహారంలో Karate Kalyaniకి క్లీన్ చిట్

ABN , First Publish Date - 2022-05-19T00:11:53+05:30 IST

దత్తపుత్రిక వ్యవహారంలో సినీ నటి కరాటే కల్యాణికి క్లిన్ చిట్ లభించింది. చిన్నారి దతత తీసుకున్నారని ..

దత్తపుత్రిక వ్యవహారంలో Karate Kalyaniకి  క్లీన్ చిట్

హైదరాబాద్ (Hyderabad): దత్తపుత్రిక వ్యవహారంలో సినీ నటి కరాటే కల్యాణి (Karate Kalyani)కి క్లీన్ చిట్ లభించింది. చిన్నారిని దతత తీసుకున్నారని కరాటే కల్యాణిపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమెను బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ విచారణకు రావాలని ఆదేశించింది. ఈ మేరకు చిన్నారి తల్లిదండ్రులతో పాటు కరాటే కల్యాణి కూడా బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. చిన్నారిని తాను దత్తత తీసుకోలేదని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‎కు ఆమె వివరించారు. 


ఈ సందర్భంగా కరాటే కల్యాణి మాట్లాడుతూ తాను దత్తత తీసుకోవాలంటే న్యాయపరంగా తీసుకుంటానన్నారు.  చిన్నారి తల్లిదండ్రులు తనతో పాటే ఉంటున్నారని తెలిపారు. రెండు రోజులుగా తనపై అనేక ఆరోపణలు వచ్చాయన్నారు.  ఈ పరిణామాలతో తన తల్లి, తమ్ముడు మనస్థాపం చెందారని.. ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేశారని.. వారికి తానే ధైర్యం చెప్పి విచారణకు హాజరయ్యానని కరాటే కల్యాణి పేర్కొన్నారు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేసిన వారిపై కోర్టుకి వెళ్తానని కరాటే కల్యాణి హెచ్చరించారు. 


Read more