కన్నులపండువగా..

ABN , First Publish Date - 2022-10-07T06:08:38+05:30 IST

కన్నులపండువగా..

కన్నులపండువగా..
కేసముద్రంలో రావణవధ నిర్వహిస్తున్న నిర్వాహకులు, మహబూబాబాద్‌ దసరా వేడుకల్లో రావణాసురుడి బొమ్మ దగ్ధమవుతున్న దృశ్యం

జిల్లాలో ఘనంగా విజయదశమి వేడుకలు

ఎస్పీ కార్యాలయంలో ఆయుధపూజ చేపట్టిన ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌

రావణవధ నిర్వహించిన ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌


మహబూబాబాద్‌ ఎడ్యుకేషన్‌, అక్టోబరు 6: జిల్లా వ్యాప్తంగా బుధవారం దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని ఆయా మం డల కేంద్రాలు, గ్రామాల్లో నిర్వహించిన వేడుకల్లో స్థానిక ప్రజాప్రతినిధులు సోరకాయలను నరికి రావణవధ, దసరా వేడుకలను నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని హన్మంతునిగడ్డ వద్ద మునిసి పాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా వేడుకల కు ముసినిపల్‌ చైర్మన్‌ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి అధ్యక్షతన ని ర్వహించిన ఈ కార్యక్రమా నికి ముఖ్యఅ తిథిగా ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ హాజరై జ్యోతిప్రజ్వళన చేసి రావణసురిడి రూపంలో ఏర్పా టు చేసిన ప్రతిమకు నిప్పంటించి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్‌నా యక్‌ మాట్లాడారు. రాబోయే దసరా వేడుకలను స్థానిక ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహించేందుకు ఏ ర్పాటు చేస్తామన్నారు. మానుకోట పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నా రు. మానుకోట జిల్లా ప్రజలు సుఖః సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండే విధంగా చూడాలని ఆ భగవంతున్ని వేడుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా డ్యాన్స్‌ పోటీలు నిర్వహించగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన చిన్నారులకు బహుమతు లను అందజేశారు. కార్యక్రమంలో ము నిసిపల్‌ వైస్‌చైర్మన్‌ ఫరీద్‌, మునిసపిల్‌ కమిషనర్‌ ప్రసన్నారాణి, స్థానిక వార్డు కౌన్సిలర్‌ హర్షిక రావిష్‌, వార్డు కౌన్సిలర్లు మార్నేని వెంకన్న, దండెబోయిన బుజ్జి వెం కన్న, చిట్యాల జనార్దన్‌, బోనగిరి గంగాధర్‌,  డీఈ ఉపేందర్‌, వ్యాఖ్యాత దాసరి ప్రసాద్‌ పాల్గొన్నారు.


ఎస్పీ కార్యాలయంలో..

జిల్లా ఎస్పీ కార్యాలయంలో దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ ఆయుధ, వాహన పూజ నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ మాట్లాడుతూ...చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి అని, ప్రజలంతా సుఖఃసంతోషాలతో ఉండాలన్నారు. నిత్యం శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజల మన్ననలను పొందాలని పోలీసు అధికారులు, సిబ్బందికి సూచించారు. సమాజంలో చెడును పారద్రోలేందుకు పోలీస్‌శాఖ కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు సదయ్య, రఘు, ఏఆర్‌ డీఎస్పీ జనార్దన్‌రెడ్డి, ఆర్‌ఐలు  నరసయ్య, పూర్ణచందర్‌, లాల్‌, బాబు, సురేష్‌, సీఐ రవీందర్‌, సిబ్బంది పాల్గొన్నారు.


పట్టణంలోని పోతులూరి వీరబ్రహేంద్రస్వామి దేవాలయంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌, మునిసపల్‌ చైర్మన్‌ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, వైస్‌చైర్మన్‌ ఫరీద్‌, వార్డు కౌన్సిలర్‌ ఎడ్ల వేణుమాదవ్‌, దేవాలయ చైర్మన్‌ పమ్మి సనాతనచారి, పర్కాల శ్రీనివాస్‌రెడ్డి,  మాధవాచారి పాల్గొన్నారు. భక్తమార్కండే య, శ్రీ పార్వతి రామలింగేశ్వరస్వామి, , శ్రీమహా గాయత్రీదేవి  ఆలయం, వేణుగోపాల స్వామి దేవాలయాల్లో దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు.


వివిధ మండలాల్లో ఇలా...

మరిపెడ మండల పరిషత్‌ ఆవరణలో నిర్వహించిన దసరా వేడుకల్లో మానుకోట ఎంపీ మాలోతు కవిత, డోర్నకల్‌ ఎమ్మెల్యే డీఎస్‌.రెడ్యానాయక్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ గుడి పుడి నవీన్‌రావు, అచ్యుతరావు, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ సింధూరకుమారి, ఎంపీపీ అరుణరాంబా బు, జడ్పీటీసీ శారదరవీందర్‌ పాల్గొన్నారు. మరిపెడ, చిన్నగూడూరు పోలీస్‌స్టేషన్‌లలో పోలీసులు అయుధపూజ నిర్వహించారు. సీఐ సాగర్‌, ఎస్సై పవన్‌, సంతోష్‌, ఝాన్సీ, చిన్నగూడూరు ఎస్సై రవికుమార్‌ పాల్గొన్నారు. దంతాలపల్లి మండలంలోని కుమ్మరికుంట్ల, దాట్ల, వేములపల్లి, రామనుజపురంలో రావణవధ నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ ఉమ, సర్పంచ్‌ కృష్ణ, శైలజ, సుష్మిత పాల్గొన్నారు. నర్సింహులపేట మండల కేంద్రంలో రాజరాజేశ్వర ఆలయం, వెంకటేశ్వరస్వామి దేవస్థాన ఆవరణలో జమ్మిచెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక హైస్కూల్లో రావణవధ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ రజితరాంరెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.పెద్దవంగర మండలంలోని వడ్డెకొత్తపల్లిలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఎన్‌.సుధాకర్‌రావు, ముత్తినేని శ్రీనివాస్‌, మల్లికార్జునాచారి, శ్రీనివాస్‌, కుషాల్‌, యాకన్న, విజయ్‌, సుభాష్‌, సతీష్‌, కుమార్‌, నవీన్‌, మహేందర్‌,  మండల కేంద్రంలో పాలకుర్తి దేవస్థాన చైర్మన్‌ వి.రాంచంద్రయ్యశర్మ, శ్రీరాంసుధీర్‌, శ్రీనివాస్‌, శ్రీరాం రాము, యాకయ్య, లింగమూర్తి, నారాయణరెడ్డి పాల్గొన్నారు. తొర్రూరు మండలం సోమారం, జమస్తాన్‌పురంలో రావణవధ కార్యక్రమం నిర్వహించారు. పీఏసీఎస్‌ చైర్మన్‌ కాకిరాల హరిప్రసాద్‌, సర్పంచులు సంపత్‌, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. గార్లలో సర్పంచ్‌ అజ్మీర భన్సీలాల్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు గంగావత్‌ లక్ష్మణ్‌నాయక్‌, సర్పంచులు డి.సక్రు, భూక్య మోతీలాల్‌, మాలోతు జ్యోతి, ఎంపీటీసీలు శీలంశెట్టి రమేష్‌, భట్టు నాగరాజు, గుండెబోయిన నాగమణి, మాలోతు వెంకట్‌లాల్‌, ధనియాకుల రాజకుమారి, అధికారులు ఎంపీడీవో రవీందర్‌, తహసీల్దార్‌ రాము పాల్గొన్నారు. బయ్యారంలో పోలీస్‌స్టేషన్‌లో ఆయుధపూజ నిర్వహించారు. సీఐ బాలాజీ, ఎస్సై రమాదేవి పాల్గొన్నారు. డోర్నకల్‌లో రైల్వే ఉద్యోగులు వారి కార్యాలయాల్లో పూజలు నిర్వహించా రు. డోర్నకల్‌ పోలీస్‌స్టేషన్‌లో సీఐ వెంకటరత్నం, ఎస్సై రవికుమార్‌లు ఆయుధపూజ నిర్వహించారు. శివకేశవ క్షేత్రంలో (పంచముఖ లింగేశ్వరస్వామి) ఆలయంలో 20 అడుగుల రావణవధ నిర్వహించారు. కేసముద్రం, వెంకటగిరి, ఉప్పరపల్లి, ఇంటికన్నె గ్రామాల్లో రావణవధ నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మాదారపు సత్యనారాయణరావు, సర్పంచులు భట్టు శ్రీను, దార్ల రాంమ్మూర్తి, గంట సంజీవరెడ్డి పాల్గొన్నా రు. నెల్లికుదురులో సర్పంచులు బీరవెల్లి యాదగిరిరెడ్డి, మునిగలవీడులో నల్లాని నవీన్‌రావు, ఎర్రబెల్లిగూడెంలో బొమ్మెర అశోక్‌, చిన్నముప్పారంలో చీకటి ప్రవీన్‌, చిన్ననాగారంలో జి.జైపాల్‌ రెడ్డి, మేచరాజుపల్లిలో ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి పాల్గొన్నారు. కొత్తగూడెం కోనాపురంలో ఓడీసీఎంఎస్‌ వైస్‌చైర్మన్‌ శ్రీనివాసరెడ్డి, సాధిరెడ్డిపల్లిలో జడ్పీటీసీ పుష్పలతశ్రీనివాస్‌, ఓటాయిలో విజయరూప్‌సింగ్‌, బత్తులపల్లిలో సొసైటీ వైస్‌ చైర్మన్‌ ఈసం కమలమ్మస్వామి, సర్పంచులు ఈసం కాంతమ్మస్వామి, వజ్జ వెంకటలక్ష్మిసురేందర్‌, కొత్తగూడలో రణధీర్‌, ఎంపీటీసీలు మోకాళ్ల సంతోషరాణివెంకటేష్‌, స్వప్నలింగన్న పాల్గొన్నారు. కురవి గ్రామ నడిబొడ్డున భూముల వేణు సొరకాయ నరికి ఉత్సవాలు ప్రారంభించారు. అనంతరం పాలపిట్టను చూసేందుకు గ్రామ పొలిమేరల్లోకి ప్రజలు తరలివెళ్లారు. అనంతరం కురవి ఆలయంలో జమ్మిచెట్టుకు పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ నూతక్కి పద్మానర్సింహారావు, ఎంపీటీసీ చిన్నం భాస్కర్‌, ఉపసర్పంచ్‌ సంగెం భరత్‌, వార్డు సభ్యులు సాంబశివరావు, మల్లికార్జున్‌, ఇరుగు వెంకన్న పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-07T06:08:38+05:30 IST