ఘోర ప్రమాదం... నలుగురి మృతి

ABN , First Publish Date - 2022-07-18T23:30:11+05:30 IST

జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. రాంగ్ రూట్‌లో వచ్చి లారీని ఢీకొట్టిన ఆటో ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.

ఘోర ప్రమాదం... నలుగురి మృతి

కామారెడ్డి: జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. రాంగ్ రూట్‌లో వచ్చి లారీని ఢీకొట్టిన ఆటో ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు అయింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మద్నూర్ మండలం మెనూర్‌లో ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. 

Read more