Kamareddy: నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు పోటెత్తిన వరద
ABN , First Publish Date - 2022-09-11T16:17:51+05:30 IST
నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు(Nizamsagar Project) వరద పోటెత్తింది. దీంతో నిజాంసాగర్ ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది
Kamareddy: నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు(Nizamsagar Project) వరద పోటెత్తింది. దీంతో నిజాంసాగర్ ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అధికారులు నిజాంసాగర్ దగ్గర 8 గేట్లు ఎత్తి దిగువ మంజీరకు నీరు విడుదల చేశారు. ఇన్‌ఫ్లో 46 వేలు, ఔట్‌ఫ్లో 80,800 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. నిజాంసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1405 ఫీట్లు కాగా, ప్రస్తుతం 1404.42 అడుగులుగా ఉంది. నిజాంసాగర్ పూర్తి నీటి సామర్థ్యం 17.802గా ఉండగా, ప్రస్తుతం 16.964 టీఎంసీలుగా కొనసాగుతుంది.