దసరాకు కా(గ్లా)సుల గలగల!

ABN , First Publish Date - 2022-10-07T09:37:40+05:30 IST

దసరా పండుగ ఎక్సైజ్‌ శాఖకు కిక్కిచ్చింది.

దసరాకు కా(గ్లా)సుల గలగల!

  • పెద్ద మొత్తంలో మద్యం, బీరు విక్రయాలు
  • 4 రోజుల్లో రూ.730 కోట్ల మద్యం లిఫ్టింగ్‌
  • రెట్టింపు స్థాయిలో రిటెయిల్‌ అమ్మకాలు

హైదరాబాద్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): దసరా పండుగ ఎక్సైజ్‌ శాఖకు కిక్కిచ్చింది. మద్యం, బీరు విక్రయాలు జోరుగా సాగాయి. తెలంగాణ స్టేట్‌ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ నుంచి నాలుగు రోజుల్లో ఏకంగా రూ.730 కోట్ల మద్యం, బీరును విక్రయించారు. ఇక రాష్ట్రంలోని మద్యం షాపులు, బార్లు, క్లబ్బుల రిటెయిల్‌ విక్రయాలను పరిగణనలోకి తీసుకుంటే రెట్టింపు స్థాయిలో సాగినట్లు సమాచారం. ప్రతి దసరా పండుగకు మద్యం విక్రయాలు జోరుగా సాగుతుంటాయి. ఈసారి కూడా అదే ఊపు కనిపించింది. బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు చెందిన మద్యం డిపోలు రాష్ట్రవ్యాప్తంగా 19 ఉన్నాయి. వీటి నుంచి రాష్ట్రంలోని 2,620 మద్యం షాపులు, 1000కి పైగా బార్లు, క్లబ్బులకు మద్యాన్ని సరఫరా చేస్తుంటారు. దసరా పర్వదినానికి ముందుగానే సెప్టెంబరు 30 నుంచే మద్యం వ్యాపారులు పెద్ద మొత్తంలో లిక్కర్‌, బీరును లిఫ్ట్‌ చేశారు. నాలుగు రోజుల్లో కార్పొరేషన్‌ రూ.730 కోట్ల విలువైన మద్యం, బీరును వ్యాపారులకు సరఫరా చేసింది. సాధారణ రోజుల్లో రోజుకు రూ.80-90 కోట్ల మద్యం విక్రయాలు సాగుతుంటాయి. కానీ, ఈ నెల 1న తప్ప మిగతా మూడు రోజుల్లో రూ.100 కోట్లకుపైగానే విక్రయాలు సాగాయి. 30న ఏకంగా రూ.313 కోట్ల మద్యం, బీరును సరఫరా చేయడం గమనార్హం. రిటెయిల్‌ మద్యం అమ్మకాలు కూడా జోరుగా సాగాయి. రెట్టింపు స్థాయిలో మద్యం, బీరు విక్రయాలు సాగినట్లు సమాచారం. .

Read more