టీఆర్ఎస్ ప్లీనరీకి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు దూరం

ABN , First Publish Date - 2022-04-28T02:34:53+05:30 IST

టీఆర్ఎస్ ప్లీనరీకి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు దూరం

టీఆర్ఎస్ ప్లీనరీకి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు దూరం

హైదరాబాద్: టీఆర్ఎస్ ప్లీనరీకి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు దూరమయ్యారు. తన కార్యకర్తలు నాయకులపై రాయలసీమ రౌడీలతో.. పోలీసుతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. సొంత టీఆర్ఎస్ పార్టీ నాయకులపై పోలీసులతో  దాడుల ఏంటీ..? అని ఆయన ప్రశ్నించారు. మంత్రికి  చెప్పినా..పోలీసు ఉన్నత అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు.  అలాగే పోలీసుల దౌర్జన్యాలపై డీజీపీ చెప్పిన స్పందించడం లేదని వాపోయారు. తీవ్రమైన మనోవేదనతోనే తాను ప్లీనరీకి రాలేక పోయానని వెల్లడించారు. 

Updated Date - 2022-04-28T02:34:53+05:30 IST