జూనియర్‌ ఖో-ఖో బాలికల ఛాంపియన్‌గా నల్లగొండ

ABN , First Publish Date - 2022-12-15T00:42:40+05:30 IST

ఉమ్మడి జిల్లా బాలికల జట్టు 41వ తెలంగాణ జూనియర్‌ ఖో-ఖో ఛాంపియన్‌ షిప్‌ సాధించిం ది. ఈ నెల 9వ తేదీ నుంచి 11వతేదీ వరకు హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ- 2022 జూనియర్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో ఉమ్మడి జిల్లా బాలికల జట్టు విజేతగా నిలిచింది. కాగా 2021లో తృతీయ స్థానం, 2020లో ద్వితీ య స్థానంలో ఉన్న బాలికల జట్టు ఈసారి ఏకంగా ప్రథమస్థానంలో నిలిచింది.

జూనియర్‌ ఖో-ఖో బాలికల ఛాంపియన్‌గా నల్లగొండ

ప్రతిభ కనబరిచిన ఉమ్మడి జిల్లా క్రీడాకారులు

భువనగిరిటౌన్‌ డిసెంబరు 14: ఉమ్మడి జిల్లా బాలికల జట్టు 41వ తెలంగాణ జూనియర్‌ ఖో-ఖో ఛాంపియన్‌ షిప్‌ సాధించిం ది. ఈ నెల 9వ తేదీ నుంచి 11వతేదీ వరకు హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ- 2022 జూనియర్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో ఉమ్మడి జిల్లా బాలికల జట్టు విజేతగా నిలిచింది. కాగా 2021లో తృతీయ స్థానం, 2020లో ద్వితీ య స్థానంలో ఉన్న బాలికల జట్టు ఈసారి ఏకంగా ప్రథమస్థానంలో నిలిచింది. అయితే ఐదేళ్ల క్రితం కూడా మొదటిసారి ఛాంపియన్‌ షిప్‌ సాధించిన బాలికల జట్టు తిరిగి 202 2 ఛాంపియన్‌గా నిలువడంపట్ల ఉమ్మడి జిల్లా ఖోఖో అభిమానులు హర్షం వ్యక్తం చేశా రు. అలాగే టోర్నీలో ప్రతిభ చూపిన ఉమ్మడి జిల్లా క్రీడాకారులు ఎం.అర్చన జ్యోతి, ఎన్‌.స్రవంతి, కె.అభినయశ్రీ, ఏ అనుష, ఆర్‌.వసంత జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈ నెల 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పశ్చిమబెంగాల్‌లో జరిగే జూనియర్‌ జాతీయ ఖో-ఖో ఛాంపియన్‌షి్‌ప పోటీల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తారు. అయితే బాలుర జట్టు 5వ స్థానంలో నిలువగా ఉమ్మడి జిల్లా క్రీడాకారుడు అజయ్‌ కుమార్‌ జాతీయ పోటీలకు అర్హత సాధించాడు. ఈ మేరకు ఉమ్మడి జిల్లా ఖో-ఖో అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు కురిమిళ్ల ఈశ్వర్‌గౌడ్‌, నాతి కృష్ణమూర్తి, యాదాద్రి జిల్లా యువజన క్రీడల అధికారి కె.ధనాంజనేయులు తదితరులు విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2022-12-15T00:42:44+05:30 IST