జడ్జిని కలిసిన జిల్లా జైళ్ల అధికారి ప్రసాద్‌

ABN , First Publish Date - 2022-02-19T05:53:29+05:30 IST

జడ్జిని కలిసిన జిల్లా జైళ్ల అధికారి ప్రసాద్‌

జడ్జిని కలిసిన జిల్లా జైళ్ల అధికారి ప్రసాద్‌
జడ్జికి బొకే అందజేస్తున్న ప్రసాద్‌

నర్సంపేట, ఫిబ్రవరి 18 : నర్సంపేట సబ్‌జైల్‌ నిర్మాణ పనులను పరిశీలించడానికి వచ్చిన స్థానిక జూనియర్‌ సివిల్‌ జడ్జి శిరీషను జిల్లా జైళ్ల శాఖ అధికారి హనుమాన్‌ ప్రసాద్‌ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సబ్‌జైల్‌ నిర్మాణ పనులను పరిశీలించారు. తుదిదశకు చేరిన సబ్‌జైల్‌ నిర్మాణ పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు. జై

ళ్ల శాఖ డీజీ జితేందర్‌, ఐజీ రాజేశ్‌, డీఐజీ డాక్టర్‌ శ్రీనివాస్‌ల ఆదేశాల మేరకు సబ్‌ జైల్‌ నిర్మాణ పనులను సందర్శించినట్లు తెలిపారు. కార్య క్రమంలో సబ్‌జైల్‌ ఉద్యోగి సురేంద్రబాబు సిబ్బంది పాల్గొన్నారు.

Read more