9న బీజేపీలో చేరుతున్నా:మొలుగూరి భిక్షపతి
ABN , First Publish Date - 2022-10-07T08:32:10+05:30 IST
తనను పార్టీ నుంచి పొమ్మనలేక చల్లా ధర్మారెడ్డి పొగబెడుతున్నందున టీఆర్‌ఎస్ నుంచి వెళ్లిపోతున్నానని పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి తెలిపారు.
పరకాల, అక్టోబరు 6: తనను పార్టీ నుంచి పొమ్మనలేక చల్లా ధర్మారెడ్డి పొగబెడుతున్నందున టీఆర్‌ఎస్ నుంచి వెళ్లిపోతున్నానని పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి తెలిపారు. హనుమకొండ జిల్లా పరకాలలో మాట్లాడుతూ తాను చల్లా కంటే 30ఏళ్ల ముందే రాజకీయాల్లోకి వచ్చానని, ఉద్యమ సమయంలో కేసీఆర్‌తో కొట్లాడి టికెట్ తెచ్చుకొని గెలిచి చూపించానన్నారు. తెలంగాణ కోసం కొట్లాడి జైలు పాలైన ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు కేసీఆర్ ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. మునుగోడు ఎన్నికల తరువాత భిక్షపతి అంటే ఏంటో చూపిస్తానన్నారు. ఈ నెల 9న మెదక్ జిల్లా నర్సాపూర్‌లో కేంద్ర మంత్రి ఽభూపేంద్ర యాదవ్ సమక్షంలో బీజేపీలో చేరుతున్నానని ఆయన తెలిపారు.