అనర్హులకు జేడీ పదోన్నతులు

ABN , First Publish Date - 2022-10-17T09:06:57+05:30 IST

వైద్యవిద్య సంచాలకులు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి అర్హులను పక్కన పెట్టి తనకు అనుకూలమైన వారికి ఉన్నత స్థానాల్లో పోస్టింగులు

అనర్హులకు జేడీ పదోన్నతులు

  • డీఎంఈ అనుకూల ప్రొఫెసర్లకే 
  • పోస్టింగ్‌లు: మెడికల్‌ జాక్‌ చైర్మన్‌ డాక్టర్‌ బొంగు రమేశ్‌

హైదరాబాద్‌, అక్టోబరు 16 (ఆంఽధ్రజ్యోతి): వైద్యవిద్య సంచాలకులు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి అర్హులను పక్కన పెట్టి తనకు అనుకూలమైన వారికి ఉన్నత స్థానాల్లో పోస్టింగులు ఇస్తున్నారని మెడికల్‌ జేఏసీ చైర్మన్‌ డాక్టర్‌ బొంగు రమేశ్‌ ఆరోపించారు. సీనియర్లను తొక్కిపెడుతున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. డీఎంఈ పరిధిలో నలుగురు ప్రొఫెసర్లను జాయింట్‌ డైరెక్టర్లుగా సర్కారు నియమించిందని, అందులో ఒక్కరు కూడా సీనియర్‌ లేరని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంఈ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. రమేశ్‌రెడ్డికి డీఎంఈగా అర్హత లేకున్నా ఇన్‌చార్జి పోస్టులో కూర్చొని సీనియర్లను అవమానించడం సబబు కాదన్నారు. అడిషనల్‌ డైరెక్టర్‌ క్యాడర్‌ వాళ్లను నియమించాలని మంత్రి హరీశ్‌రావు ఇచ్చిన అదేశాలలో స్పష్టంగా ఉన్నా, దాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం బాధాకరమన్నారు. ఈ నియామకాలను వెంటనే రద్దుచేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేకుంటే న్యాయ పోరాటానికి సిద్ధమవుతామని డాక్టర్‌ బొంగు రమేశ్‌ హెచ్చరించారు.

Updated Date - 2022-10-17T09:06:57+05:30 IST