బీజేపీలోకి Jayasudha? ఆపరేషన్ ఆకర్ష్ వేగవంతం..

ABN , First Publish Date - 2022-08-09T18:02:16+05:30 IST

సినీనటి జయసుధతో బీజేపీ నాయకత్వం సంప్రదింపులు జరుపుతోందని తెలుస్తోంది. వైఎస్ఆర్ హాయాంలో కాంగ్రెస్ పార్టీలో ఆమె కీలకంగా వ్యవహరించారు.

బీజేపీలోకి Jayasudha? ఆపరేషన్ ఆకర్ష్ వేగవంతం..

Hyderabad : సినీనటి జయసుధతో బీజేపీ(BJP) నాయకత్వం సంప్రదింపులు జరుపుతోందని తెలుస్తోంది. వైఎస్ఆర్ హాయాంలో కాంగ్రెస్ పార్టీ(Congress Party)లో ఆమె కీలకంగా వ్యవహరించారు. 2009లో సికింద్రాబాద్ ఎమ్మెల్యే(Secunderabad MLA)గా జయసుధ పనిచేశారు. తాజాగా జయసుధను బీజేపీ చేరికల కమిటీ తమ పార్టీలోకి ఆహ్వానించింది. సినీ గ్లామర్ అనేది తమ పార్టీకి బాగా కలిసొస్తుందని బీజేపీ గత కొంతకాలంగా నమ్ముతూ వస్తోంది. ఈ క్రమంలోనే ప్రముఖ సినీ నటులను తమ పార్టీలోకి చేర్చుకుంటోంది. తమిళనాడులో కుష్బూ, తెలంగాణలో విజయశాంతి(Vijayashanthi).. ఇలా ప్రతి రాష్ట్రంలోనూ సినీ ప్రముఖులను తమ పార్టీలో చేర్చుకుంటోంది. ఈ క్రమంలోనే జయసుధతో సంప్రదింపులు జరుపుతోంది. 


2009 ఎన్నికలలో జయసుధ సికింద్రాబాద్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. వైఎస్సార్(YSR) ఆమెకు సికింద్రాబాద్(Secunderabad) సీటు ఇచ్చారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి(YS Rajasekhar Reddy) అకాల మరణం అనంతరం ఆమె ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత 2016లో టీడీపీ(TDP)లో చేరారు. ఆ తరువాత తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి  వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి తనయుడు పెట్టిన పార్టీ కాబట్టి తిరిగి తనకు సొంత గూటికి వచ్చినట్టుందని ఆమె వైసీపీలో చేరిన సందర్భంగా తెలిపారు. ఇటీవలి కాలంలో జయసుధ సైలెంట్‌గా ఉంటూ వస్తున్నారు. మరి ఇప్పుడు బీజేపీ ఇచ్చిన ఆఫర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో వేచి చూడాలి.

Updated Date - 2022-08-09T18:02:16+05:30 IST