తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేయాలని ఉంది : జయప్రద
ABN , First Publish Date - 2022-05-31T15:56:12+05:30 IST
తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేయాలని ఉంది : జయప్రద

హైదరాబాద్ సిటీ/హిమాయత్‌నగర్ : స్వతహాగా తెలుగు మహిళను (Telugu Women) అయిన తనకు తెలుగు రాష్ట్రాల్లోని (Telugu States) ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందని, పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే తాను ఆ దిశగా ముందుకు సాగుతానని బీజేపీ (BJP) నాయకురాలు, మాజీ ఎంపీ జయప్రద అన్నారు. సోమవారం ఆమె హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని ఓ క్లినిక్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ గెలుపునకు పాటుపడతానని చెప్పారు. తెలంగాణ, ఏపీలో అధికారంలో ఉన్న పార్టీలు పాలనను గాలికి వదిలేశాయని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజల సమస్యలను పరిష్కరించిన తర్వాతే దేశ రాజకీయాల్లోకి వెళ్లాలని ఆమె సూచించారు.