జయహో గణేశా..

ABN , First Publish Date - 2022-09-10T06:13:42+05:30 IST

జయహో గణేశా..

జయహో గణేశా..

ఘనంగా గణనాథుల నిమజ్జనం

శోభాయాత్రలో ఉప్పొంగిన భక్తిభావం

నిమజ్జన కేంద్రాల వద్ద సందడే సందడి..

వినాయకుల ఊరేగింపులో యువత కేరింతలు 

ఏర్పాట్లను పర్యవేక్షించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు

ఉత్సవాలకు వర్షం ఆటంకం

జిల్లాలో ముగిసిన నవరాత్రి వేడుకలు


వరంగల్‌ కలెక్టరేట్‌/పోచమ్మ మైదాన్‌/ మట్టెవాడ, సెప్టెంబరు 9: అడుగ డుగునా ఉప్పొంగిన భక్తిభావం.. మది నిండా స్వామివారిని స్మరిస్తూ శోభా యాత్రలో పాల్గొన్న అశేష జనం.. యు వత కేరింతలు.. మహిళల కోలాటాలతో జిల్లా ఆధ్యాత్మిక శోభను సంతరించు కుంది. తొమ్మిది రోజుల పాటు భక్తుల పూజలందుకొన్న గణనాథులు నిమజ్జ నాల నిమజ్జనం శుక్రవారం అట్టహాసం గా జరిగింది. భక్తులతో నిమజ్జన కేంద్రాలు కిక్కిరిసిపోయాయి. జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరిగాయి. వరంగల్‌ నగరంలోని దేశాయిపేట చిన్న వడ్డెపల్లి చెరువు, ఉర్సు గుట్ట సమీపంలోని రంగ సము ద్రం, గొర్రెకుంట సమీపంలోని కట్టమల్లన్న  చెరువు, హనుమాన్‌ జంక్షన్‌ సమీపంలోని పైడిపెల్లి చెరువు, ఖిలావరంగల్‌ చెరువు, నర్సంపేటలోని దామెర చెరువు, వర్ధన్నపేటలోని కోనారెడ్డి చెరువులలో వినాయక నిమజ్జనాలు కొనసాగాయి. 


సందడిగా శోభాయాత్ర

మండపాల నుంచి గణనాథుల శోభాయాత్ర అట్టహాసంగా జరిగింది.  యువత డప్పు చప్పుళ్లు, కోలాటా లు, నృత్యాలతో, భజన కీర్తనలో ఆధ్యాత్మికత ఉట్టిపడింది. భక్తులు వినాయక మండపాల నిర్వాహ కులు గణనాథులను ఆటోలు, ట్రాలీలు, ట్రాక్టర్ల ద్వారా, కార్లు, ద్విచక్ర వాహనాలపై నిమజ్జనానికి తీసుకెళ్లారు. వాహనాలను విద్యు త్‌దీపాలతో అలంకరించారు. వివిధ ఆకృతుల్లో సెట్టింగులు వేసిన వాహనాల్లో గణనాథులను నిమజ్జనానికి తరలించారు. డీజేలకు ఎలాం టి పర్మిషన్‌ లేకపోవడంతో శోభాయాత్ర సాఫీగా సాగింది. వినాయకు డు వాహనం ముందు యువత నృత్యాలతో సందడి చేసింది.


ప్రజా ప్రతినిధులు.. అధికారుల పర్యవేక్షణ..

వరంగల్‌లోని దేశాయిపేట చిన్నవడ్డెపల్లి చెరువులో తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌, వర్ధన్నపేటలో ఎమ్మెల్యే అరూరి రమేష్‌ కోనారెడ్డి చెరువు వద్ద, నర్సంపేటలోని దామెర చెరువు వద్ద ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పాల్గొని ఏర్పాట్లును పరిశీలించారు. అలాగే, కలెక్టర్‌ బి.గోపి, అడిషనల్‌ కలెక్టర్లు కె. శ్రీవత్స, బి.హరిసింగ్‌లు నర్సంపేటలోని దామెర చెరువులో ఉత్సవాలను పర్యవేక్షించారు. మేయర్‌ గుండు సుధారాణి, కమిషనర్‌ పి.ప్రావీణ్య ఏర్పాట్లును పరిశీలించారు. అలాగే ములుగురోడ్డు సమీపంలోని హనుమాన్‌ జంక్షన్‌ వద్ద గల కోట చెరువులో నిమజ్జన ఏర్పాట్లను జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ బి.హరిసింగ్‌ పరిశీలించారు. మధ్యాహ్నం నుంచే భక్తులు విగ్రహాలను నిమజ్జనం చేశారు. పోచమ్మమైదాన్‌, జేపీఎన్‌ రోడ్డు ప్రాంతాల్లో విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో నిమజ్జనానికి తరలి వెళ్తున్న గణనాథులకు ఘన స్వాగతం పలికారు. 


పకడ్బందీ ఏర్పాట్లు..

ప్రధాన రహదారుల గుండా పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిమజ్జనాలు ప్రాంతాల్లో భారీ క్రేన్లు, తెప్పలు, బోట్‌ సిబ్బంది, గజ ఈతగాళ్లను అప్రమత్తంగా ఉంచారు. తెల్లవారు వరకు కొనసాగనున్న నిమజ్జనానికి ఎలాంటి అంతరాయం కలుగకుండా విద్యుత్‌ లైట్లతో ఏర్పాటు చేశారు. నిమజ్జనం జరిగే ప్రాంతాల వద్ద ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు మున్సిపాలిటీ సిబ్బంది శుభ్రంగా ఉంచారు. నిమజ్జన ప్రదేశాల్లో జిల్లా వైద్యఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. వరంగల్‌ దేశాయిపేటలోని చిన్న వడ్డెపల్లి  చెరువు వద్ద నిమజ్జనానికి ఇన్‌చార్జీలు జిల్లా ఉద్యాన వన శాఖ అధికారి శ్రీనివాసరావు, రాయపర్తి తహసీల్దార్‌ సత్యనారాయణ, ఇతర అధికారులు, పోలీసు అధికారులు, మున్సిపల్‌ సిబ్బంది, రెవెన్యూ అధికారులు, వైద్య, విద్యుత్‌ సిబ్బంది, అగ్నిమాపక శాఖ సిబ్బంది తమ విధులను నిర్వహిస్తూ అప్రమత్తంగా ఉన్నారు.


ఉత్సాహానికి వాన దెబ్బ.. 

నగరంలో మధ్యాహ్నం నుంచే జోరువాన పడింది. వానలోనూ గణపతుల శోభాయాత్ర సాగింది. అయితే వర్షానికి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు వర్షంలోనే నృత్యాలతో ముందుకు సాగారు.  వానదెబ్బకు మండపాల నుంచి నిర్వాహకులు ఆలస్యంగా గణనాథులను తరలించారు.


తీన్మార్‌ మోత..

శోభాయాత్రలో తీన్మార్‌ డప్పులు, రెట్టించిన ఉత్సాహానిచ్చాయి. నగరంలో, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తీన్మార్‌ డప్పులు వాయించే వారు, డప్పు వాయిద్యకారులు, కళా బృందాలు ఆకట్టుకున్నాయి. కొందరు ఏకరూప దుస్తువులతో అలరించారు. గణపతిబప్పా మోరియ అంటూ యువత నినాదాలతో భక్తి పారవశ్యంలో మునిగితేలింది. 

Read more