Janareddy : కాంగ్రెస్ పార్టీలో ఇదొక మలుపు
ABN , First Publish Date - 2022-10-17T17:22:39+05:30 IST
చాలా కాలం తరువాత ఏఐసీసీ (AICC) అధ్యక్ష పదవికి డెమొక్రటిక్గా ఎన్నికలు జరుగుతున్నాయని కాంగ్రెస్
Hyderabad : చాలా కాలం తరువాత ఏఐసీసీ (AICC) అధ్యక్ష పదవికి డెమొక్రటిక్గా ఎన్నికలు జరుగుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి (Janareddy) పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ (Congress Party)లో ఇది ఒక మలుపు అని ఆయన పేర్కొన్నారు. ఎన్నిక ప్రశాంతంగా జరుగుతోందన్నారు. ఎన్నిక సందర్భంగా వివాదాలు మాట్లాడడం సరైంది కాదని తాను భావిస్తున్నానని జానారెడ్డి పేర్కొన్నారు. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి చరిత్ర సృష్టిస్తోందన్నారు. రెండు ప్రభుత్వాలు ఎన్నికపై జవాబు చెప్పాలన్నారు. మునుగోడు ప్రజలు పార్టీలకు అతీతంగా ఓటేస్తారని జానారెడ్డి పేర్కొన్నారు.