ఆగని పోరాటం

ABN , First Publish Date - 2022-06-11T05:39:59+05:30 IST

ఆగని పోరాటం

ఆగని పోరాటం
పోలీసుల దెబ్బలకు సొమ్మసిల్లి పడిపోయిన మహిళ

జక్కలొద్దిలో గుడిసెవాసుల ఆందోళన

అడ్డుకున్న పోలీసులు

ఇరువర్గాల మధ్య ఘర్షణ, సొమ్మసిల్లి పడిపోయిన మహిళలు

జక్కలొద్దిని సందర్శించిన అఖిల పక్ష నేతలు

మామునూరు, జూన్‌ 10 : వరంగల్‌ జిల్లా ఖిలావరంగల్‌ మండలం జక్కలొద్దిలో గుడిసెవాసుల పోరాటం రోజురోజుకూ ఉధృతమవుతోంది. సీపీఎం రంగశాయిపేట ఏరియా కమిటీ కార్యదర్శి మాలోతు సాగర్‌ ఆధ్వర్యంలో నెల రోజుల కిందట ప్రభుత్వ భూముల్లో వేలాది మంది పేదలు గుడిసెలు వేశారు. మూడు రోజుల కింద రెవెన్యూ శాఖ, పోలీసులు గుడిసెలను బలవంతంగా తొలగించారు. శుక్రవారం వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు భారీగా జక్కలొద్దికి తరలివచ్చి మళ్లీ గుడిసెలు వేసేందుకు ప్రయత్నించారు. ఖిలావరంగల్‌ తహసీల్దార్‌ ఫణికుమార్‌ సందర్శించి ఉద్యమ కారులతో మాట్లాడారు. కానీ పోరాటం విరమించబోమని మహిళలు తేల్చి చెప్పారు. మామునూరు సీఐ రమేష్‌ నాయక్‌, ఎస్‌ఐలు రాజేష్‌రెడ్డి, కృష్ణవేణి, రాజన్‌ బాబులు పోలీసుల బలగాలతో వచ్చి అడ్డుకున్నారు. రహదారుల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద నుంచి రాకుండా గుడిసెవాసులను అడ్డుకున్నారు. జక్కలొద్ది ప్రాంతాన్ని పోలీసులు రోప్‌ తాళ్లతో దిగ్భంధించి ఆధీనంలోకి తీసుకున్నారు. మహిళలు వినకుండా ఆందోళన చేశారు. సీఐతో వాదనకు దిగారు. కాగా, అన్నం తింటున్న వారిని పోలీసులు బలవంతా వాహనాల్లో ఎక్కించి తరలించారు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవ జరగడంతో పలువరు మహిళలకు గాయాలయ్యాయి. కొంద మంది మహిళలు సొమ్మసిల్లి పడి పోయారు. దీంతో ఒక్కసారిగి  దీంతో ఉద్రిక్తత నెలకొంది. సీపీఎం నాయకుడు ఓదేలును పోలీసులు ఆరెస్టు చేసి తరలించారు. పోలీసు వాహన డ్రైవర్‌ మహిళ తొడపై విపరీతంగా కొట్టినట్లు తోటి మహిళలు ఆరోపించారు. కలెక్టర్‌తో మాట్డాడిస్తామని చెప్పి మామునూరు సీఐ రమేష్‌ నాయక్‌ గుడిసెవాసులను వాహనాల్లో ఎక్కించి పోలీసుస్టేషన్‌లకు తరలించినట్లు వాపోయారు.  

జక్కలొద్దిని సందిర్శించిన అఖిల పక్ష నేతలు

జక్కలొద్ది గుడిసెవాసుల పోరాటానికి హనుమకొండ. వరంగల్‌ జిల్లాల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి మద్దతు ప్రకటించారు. అఖిల పక్షం ఆధ్వర్యంలో నేతలు శుక్రవారం జక్కలొద్ది ప్రాంతాన్ని సందర్శించారు. ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్న పేదలపై పోలీసుల దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండించారు. పోలీసులు గుడిసెలను కూల్చి, కాల్చి వేయడం చాలా దర్మార్గమన్నారు. పేదల గుడిసెల పోరాటానికి ఎల్లప్పుడు తోడుగా ఉంటామని అఖిల పక్షం నాయకులు తెలిపారు. 

కార్యక్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి నమిండ్ల శ్రీనివాస్‌, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, పీసీసీ కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాస్‌, నాయకులు మీసాల ప్రకాష్‌, దాసరి రాజేష్‌, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్‌కె బాషుమియా, వీఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ నాయకులు ఎం. వెంకట్‌రెడ్డి, రజనీకాంత్‌, సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ నాయకులు గంగుల దయాకర్‌, ఆర్‌ఎస్‌పీ జిల్లా కార్యదర్శి కె.శివాజీ, డీబీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి చంచు రాజేందర్‌, తెలంగాణ అంబేడ్కర్‌ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జన్ను నర్సయ్య, జిల్లా కార్యదర్శి ముద రవీందర్‌, ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి విజయ్‌కుమార్‌, సకల సంస్కృతిక మండలి రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం సుధాకర్‌, సీపీఎం పార్టీ జిల్లా నాయకులు రత్నమాల, రామస్వామి, సాగర్‌, దుర్గయ్య, ఓదేలు, రంగయ్య, జగదీష్‌, ఎమ్మార్సీఎస్‌ నాయకుడు బిర్రు మహేందర్‌, కుల వివక్షత పోరాట సమితి నాయకులు అరూరి కుమార్‌ పాల్గొన్నారు.  


Updated Date - 2022-06-11T05:39:59+05:30 IST