రైల్లో ఢిల్లీకి జగ్గారెడ్డి పయనం

ABN , First Publish Date - 2022-12-07T03:01:04+05:30 IST

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఢిల్లీకి పయనమయ్యారు. మంగళవారం రైల్లో బయలుదేరి వెళ్లిన ఆయన.. బుధవారం ఉదయం ఢిల్లీకి చేరుకుంటారు.

రైల్లో ఢిల్లీకి జగ్గారెడ్డి పయనం

ఖర్గేను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకే..

హైదరాబాద్‌, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఢిల్లీకి పయనమయ్యారు. మంగళవారం రైల్లో బయలుదేరి వెళ్లిన ఆయన.. బుధవారం ఉదయం ఢిల్లీకి చేరుకుంటారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మల్లికార్జున ఖర్గేను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన వెళ్లినట్లు తెలిసింది. కొన్ని రోజులుగా పలువురు తెలంగాణ నేతలు మల్లికార్జున ఖర్గేను కలసి శుభాకాంక్షలు చెబుతూ వస్తున్నారు. ఈ సందర్భంగా తనను కలుస్తున్న నేతల నుంచి ఖర్గే ఫీడ్‌ బ్యాక్‌ను తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జగ్గారెడ్డి.. ఆయన్ను కలవనుండడం ఆసక్తికరంగా మారింది. కాగా, ఢిల్లీకి వెళ్లే కాంగ్రెస్‌ నేతలు సహజంగా విమాన ప్రయాణమే చేస్తుంటారు. కానీ.. జగ్గారెడ్డి మాత్రం రైలులోనే ఢిల్లీ వెళ్లడానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. విమానంలో ప్రయాణం పట్ల కొంత ఫోబియా ఉండడం కారణంగానే రైలు ప్రయాణానికి జగ్గారెడ్డి మొగ్గు చూపుతారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Updated Date - 2022-12-07T03:01:05+05:30 IST