నియోజకవర్గ నేతలతో జగ్గారెడ్డి భేటీ రేపు !

ABN , First Publish Date - 2022-02-23T09:11:22+05:30 IST

కాంగ్రెస్‌కు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి...

నియోజకవర్గ నేతలతో జగ్గారెడ్డి భేటీ రేపు !

హైదరాబాద్‌, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌కు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి... నియోజకవర్గ నేతలతో భేటీ కాబోతున్నారు. తన భవిష్యత్తు కార్యాచరణపై నేతలతో చర్చించనున్నారు. గురువారం లేదా శుక్రవారం ఈ సమావేశం జరుగుతుందని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అనంతరం మార్చి రెండో వారంలో సంగారెడ్డి వేదికగా కార్యకర్తలతో ఓ భారీ సభ నిర్వహించే ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీకి చెందిన పలువురు సీనియర్‌ నేతల వినతి మేరకు జగ్గారెడ్డి తన రాజీనామా నిర్ణయాన్ని 15 రోజులు వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. రాజీనామా నిర్ణయాన్ని మార్చుకోవాలంటూ కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి కూడా మంగళవారం ఆయనను ఫోన్‌ ద్వారా కోరారు.  

Updated Date - 2022-02-23T09:11:22+05:30 IST