విద్యా ప్రమాణాలను పెంపునకు ఐఎస్‌బీ సహకారం!

ABN , First Publish Date - 2022-07-21T10:23:21+05:30 IST

రాష్ట్రంలో ఉన్నత విద్య ప్రమాణాలను మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎ్‌సబీ) సహకారం తీసుకోనున్నారు.

విద్యా ప్రమాణాలను పెంపునకు  ఐఎస్‌బీ సహకారం!

రాష్ట్రంలో ఉన్నత విద్య ప్రమాణాలను మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎ్‌సబీ) సహకారం తీసుకోనున్నారు. ఇందులో భాగంగా ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి, సాంకేతిక విద్యా శాఖ కార్యదర్శి నవీన్‌మిట్టల్‌ తదితరులు ఐఎ్‌సబీ ప్రతినిధులతో బుధవారం సమావేశమయ్యారు. వృత్తి విద్యా కోర్సులు చదువుతున్న విద్యార్థుల నైపుణ్యం పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. మరోసారి సమావేశమై ఓ ప్రణాళికను రూపొందిచనున్నారు. 

Updated Date - 2022-07-21T10:23:21+05:30 IST