ఇప్పటికే వసూలు చేసిన.. రూ.30లక్షల కోట్ల సెస్‌ చాల్లేదా?

ABN , First Publish Date - 2022-12-16T03:28:35+05:30 IST

హైదరాబాద్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): కేంద్రం సెస్‌రూపంలో ఇప్పటి వరకు వసూలు చేసిన రూ.30 లక్షల కోట్లు చాల్లేదా? అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రశ్నించారు. పనిచేయని ప్రభుత్వం(ఎన్పీఏ గవర్నమెంట్‌)

ఇప్పటికే వసూలు చేసిన.. రూ.30లక్షల కోట్ల సెస్‌ చాల్లేదా?

కేంద్రమంత్రి హర్దీప్‌ వ్యాఖ్యలపై ట్విటర్‌లో కేటీఆర్‌ కౌంటర్‌

హైదరాబాద్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): కేంద్రం సెస్‌రూపంలో ఇప్పటి వరకు వసూలు చేసిన రూ.30 లక్షల కోట్లు చాల్లేదా? అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రశ్నించారు. పనిచేయని ప్రభుత్వం(ఎన్పీఏ గవర్నమెంట్‌) వల్లే ఇంధన ధరలు పెరిగాయని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్పీఏ ప్రభుత్వం విధిస్తున్న సెస్‌ వల్ల రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన 41 శాతం వాటా కూడా రావడం లేదన్నారు. పన్నుల తగ్గింపుపై కేంద్రమంత్రి హార్దీప్‌ సింగ్‌ పూరీ పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్‌ గురువారం ట్విటర్‌ వేదికగా స్పందించారు. తెలంగాణ, పశ్చిమబెంగాల్‌, ఏపీ, తమిళనాడు, కేరళ, ఝార్ఖండ్‌ రాష్ట్రాలు ట్యాక్స్‌ తగ్గించలేదని, ఆయా రాష్ట్రాలు వ్యాట్‌ (వాల్యూ యాడెడ్‌ టాక్స్‌) తగ్గిేస్త ప్రజలపై భారం తగ్గుతుందని హర్దీ్‌పసింగ్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 2014 నుంచి ఇప్పటివరకు ఇంధనంపై వ్యాట్‌ను పెంచలేదని, ఒక్కసారి మాత్రమే రౌండెడ్‌ ఆఫ్‌ చేసినట్లు తెలిపారు. తమ ప్రభుత్వం వ్యాట్‌ పెంచనప్పటికీ.. వ్యాట్‌ని తగ్గించని రాష్ట్రాల జాబితాలో తెలంగాణ పేరు చేర్చడం ఏమిటని, ప్రధాని మోదీ మాట్లాడుతున్న కో-ఆపరేటివ్‌ ఫెడరలిజం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. అసమర్థ ప్రభుత్వం కారణంగానే ఇంధన ధరలు పెరిగాయని విమర్శించారు. రష్యా నుంచి డిస్కౌంట్‌పై క్రూడాయిల్‌ కొనుగోలు చేయడంతో కేంద్రానికి రూ.35వేల కోట్లు ఆదా అవుతుండగా, సాధారణ ప్రజలకు ఏ ప్రయోజనం చేకూరడం లేదని, మరి ఎవరికి ఆ లబ్ధి చేకూరుతోందని ఆయన ప్రశ్నించారు. కేంద్రసర్కారు సెస్‌ను రద్దుచేేస్త రాష్ట్రాలు రూ.70కి లీటరు పెట్రోలు, రూ.60కి డీజిల్‌ను ప్రజలకు అందిస్తాయని కేటీఆర్‌ తెలిపారు.

Updated Date - 2022-12-16T03:28:36+05:30 IST