మోదీ దయ వల్ల బయటపడ్డారా?

ABN , First Publish Date - 2022-03-05T06:40:17+05:30 IST

రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత విద్యార్థుల

మోదీ దయ వల్ల బయటపడ్డారా?

 విద్యార్థుల తరలింపుపై కేటీఆర్‌ ప్రశ్న


రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత విద్యార్థుల తరలింపుపై బీజేపీ, కేంద్ర ప్రభుత్వ పెద్దలు విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నారని  మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. ప్రధాని మోదీ దయ వల్లే బతికి బయటపడ్డామంటూ ఉక్రెయిన్‌ నుంచి వస్తున్న విద్యార్థులతో నినాదాలు చేయించడం దారుణమన్నారు. విద్యార్థులతో వైమానిక సిబ్బంది నినాదాలు చేయిస్తున్న వీడియోను పోస్ట్‌ చేస్తూ టీఆర్‌ఎస్‌ నాయకుడు జగన్‌ చేసిన ట్వీట్‌కు మంత్రి కేటీఆర్‌ స్పందించారు. అర్థంలేనితననానికి ఈ చర్యలు పరాకాష్ట అని విమర్శించారు. అయితే ఉక్రెయిన్‌ నుంచి ఢిల్లీలోని  తెలంగాణ భవన్‌కు చేరుకున్న విద్యార్థులు.. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ల చలవ వల్ల తమను ఇక్కడ చక్కగా చూసుకుంటున్నారంటూ ట్వీట్‌ చేయడాన్ని ప్రస్తావిస్తూ కొందరు.. ‘మరి ఇదేంటి కేటీఆర్‌ గారూ?’ అని ట్విటర్‌లో ప్రశ్నించారు.  


Read more