స్వాతంత్య్ర వజ్రోత్సవ లోగో ఆవిష్కరణ
ABN , First Publish Date - 2022-08-04T10:03:44+05:30 IST
స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఆగస్టు 8 నుంచి 22వరకు రాష్ట్రంలో సాంస్కృతిక, క్రీడా, సామాజిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు వజ్రోత్సవ కమిటీ చైర్మన్, ఎంపీ కే.కేశవరావు తెలిపారు.
22 వరకు వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకలు: కేకే
రవీంద్రభారతి, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఆగస్టు 8 నుంచి 22వరకు రాష్ట్రంలో సాంస్కృతిక, క్రీడా, సామాజిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు వజ్రోత్సవ కమిటీ చైర్మన్, ఎంపీ కే.కేశవరావు తెలిపారు. ప్రత్యేక లోగోను ప్రభుత్వ సలహాదారు కేవీ.రమణాచారి, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, సీఎం ఆఫీస్ ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివా్‌సలతో కలిసి సాహిత్య అకాడమీ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రత్యేకతను పరిగణనలోకి తీసుకొని కార్యక్రమాలను రూపొందించామన్నారు.