పాలమూరు వాసికి అంతర్జాతీయ పురస్కారం

ABN , First Publish Date - 2022-08-04T09:42:21+05:30 IST

ఎయిడ్స్‌ బాధితులకు సులభతర చికిత్సపై పరిశోధన చేసిన మహబూబ్‌నగర్‌ జిల్లావాసి వంశీకృష్ణ జోగిరాజుకు అంతర్జాతీయ యువశాస్త్రవేత్త పురస్కారం లభించింది.

పాలమూరు వాసికి అంతర్జాతీయ పురస్కారం

అడ్డాకుల, ఆగస్టు 3: ఎయిడ్స్‌ బాధితులకు సులభతర చికిత్సపై పరిశోధన చేసిన మహబూబ్‌నగర్‌ జిల్లావాసి వంశీకృష్ణ జోగిరాజుకు అంతర్జాతీయ యువశాస్త్రవేత్త పురస్కారం లభించింది. కెనడాలోని మాంట్రియల్‌లో జూలై 29 నుంచి ఆగస్టు 2 వరకు 24వ అంతర్జాతీయ ఎయిడ్స్‌ సదస్సు నిర్వహించారు. వివిధ దేశాలకు చెందిన 10 వేల మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. 2100 పరిశోధనలను ప్రెజెంట్‌ చేయగా అందులో క్లినికల్‌ సైన్స్‌ విభాగంలో వంశీకృష్ణకు యువశాస్త్రవేత్త అవార్డు దక్కింది. మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్‌కు చెందిన శ్రీనావాసరావు, రమాదేవి దంపతుల కుమారుడైన డాక్టర్‌ వంశీకృష్ణ అమెరికాలోని గిలీడ్‌ సైన్సె్‌సలో వైరాలజీ విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. 


Updated Date - 2022-08-04T09:42:21+05:30 IST