లభ్యంకాని చిన్నారి ఇందు ఆచూకీ
ABN , First Publish Date - 2022-12-16T08:25:22+05:30 IST
జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్‌కి చెందిన 4వ తరగతి విద్యార్థిని నిన్న దమ్మాయిగూడా ప్రభుత్వ పాఠశాలలో నుంచి వెళ్లిన ఇందు ఆచూకీ ఇప్పటి వరకూ లభ్యం కాలేదు.
Medchal : జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్‌కి చెందిన 4వ తరగతి విద్యార్థిని నిన్న దమ్మాయిగూడా ప్రభుత్వ పాఠశాలలో నుంచి వెళ్లిన ఇందు ఆచూకీ ఇప్పటి వరకూ లభ్యం కాలేదు. నిన్న ఉదయం స్కూల్‌కి వెళ్లిన ఇందు ఆడుకుంటానని బయటకి వెళ్లి అదృశ్యం కావడంతో చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 24 గంటలు గడిచినా కూడా కూతురి జాడ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. బాలిక ఆచూకీ కనిపెట్టినందుకు పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఇందు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వీడియో సీసీ కెమెరాలో నమోదయింది.