బహిరంగంగా పొగతాగే వారిపై పెరిగిన కేసులు
ABN , First Publish Date - 2022-12-16T00:38:21+05:30 IST
బహిరంగప్రదేశాల్లో పొగతాగే వారిపై నమోదవుతున్న కేసుల సంఖ్య పెరిగింది. తెలంగాణలో 2019-20లో 15,126 కేసులు నమోదు కాగా, 2021-22లో ఆ సంఖ్య 28,035కు పెరిగింది. రా
హైదరాబాద్, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): బహిరంగప్రదేశాల్లో పొగతాగే వారిపై నమోదవుతున్న కేసుల సంఖ్య పెరిగింది. తెలంగాణలో 2019-20లో 15,126 కేసులు నమోదు కాగా, 2021-22లో ఆ సంఖ్య 28,035కు పెరిగింది. రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య సహాయ మంత్రి డా. భారతి ప్రవీణ్ పవార్ ఈ వివరాలు వెల్లడించారు. కేసుల నమోదులో దేశంలో తెలంగాణ 15వ స్థానంలో నిలిచింది. హిమాచల్‌ప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.