శంషాబాద్ విమానాశ్రయంలో అంతర్జాతీయ అరైవల్ టెర్మినల్ ప్రారంభం
ABN , First Publish Date - 2022-12-08T19:19:23+05:30 IST
శంషాబాద్ విమానాశ్రయంలో అంతర్జాతీయ అరైవల్ టెర్మినల్‌ను ప్రారంభించారు. నూతన టెర్నినల్‌ను మస్కట్ (Masqut) నుంచి హైదరాబాద్ (Hyderabad) వచ్చిన సూర్య దంపతుల చేత అధికారులు ప్రారంభించారు.
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో అంతర్జాతీయ అరైవల్ టెర్మినల్‌ను ప్రారంభించారు. నూతన టెర్నినల్‌ను మస్కట్ (Masqut) నుంచి హైదరాబాద్ (Hyderabad) వచ్చిన సూర్య దంపతుల చేత అధికారులు ప్రారంభించారు. అంతర్జాతీయ ప్రయాణం ఇకపై ప్రధాన టెర్మినల్ నుంచి ప్రారంభమవుతుందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి విదేశాలకు వెళ్తున్న ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేందుకు నవంబర్ 28 నుంచి విమానాశ్రయంలో నూతన అంతర్జాతీయ డిపార్చర్ హాల్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కొత్త అరైవల్ టెర్మినల్‌ను ప్రస్తుత టెర్మినల్‌తో అనుసంధానించారు. శంషాబాద్ విమానాశ్రయం.. అంతర్జాతీయ ప్రమాణాలకు తీసిపోని విధంగా అభివృద్ధి చెందుతోంది. ఈ విమానాశ్రయం నుంచి రోజూ కొన్ని వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రయాణికుల సౌకర్యార్థం పలు అభివృద్ధి పనులను అధికారులు చేపడుతున్నారు.
