చంద్రబాబు కుటుంబంపై అనుచిత పోస్టులు.. వ్యక్తిని రోడ్డుపైకి ఈడ్చుకొచ్చి కొట్టిన టీడీపీ నేతలు

ABN , First Publish Date - 2022-09-30T04:34:03+05:30 IST

సోషల్ మీడియాలో చంద్రబాబు కుటుంబం (Chandrababu Family)పై అనుచిత పోస్టులు చేసిన వ్యక్తికి టీడీపీ (Tdp) నేతలు దేహశుద్ధి చేశారు. రోడ్డుపైకి...

చంద్రబాబు కుటుంబంపై అనుచిత పోస్టులు.. వ్యక్తిని రోడ్డుపైకి ఈడ్చుకొచ్చి కొట్టిన టీడీపీ నేతలు

ఖమ్మం: సోషల్ మీడియాలో చంద్రబాబు కుటుంబం (Chandrababu Family)పై అనుచిత పోస్టులు చేసిన వ్యక్తికి టీడీపీ (Tdp) నేతలు దేహశుద్ధి చేశారు. రోడ్డుపైకి ఈడ్చుకుంటూ వచ్చి చెంప చెళ్లుమనిపించారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా ఘంటశాలకు చెందిన ఆర్ఎంపీ వైద్యుడు కోదాటి నరసింహ వైసీపీ (Ycp) కార్యకర్తగా పని చేస్తున్నారు. ఖమ్మంలోని టేకులపల్లిలో నివాసం ఉంటున్నాడు. కొంతకాలంగా సామాజిక మాధ్యమాల(Social Media)లో చంద్రబాబు కుటుంబానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో నారా బ్రాహ్మణి (Nara Brahmani), భువనేశ్వరి (Bhuvaneshwari)ని ఉద్దేశించి అసభ్యకరంగా కామెంట్స్ పోస్టు చేశారు. నరసింహను పలుమార్లు టీడీపీ నాయకులు హెచ్చరించినా తీరు మార్చుకోలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ శ్రేణులు నరసింహపై దాడి చేశారు. ఎవరైనా సరే చంద్రబాబు కుటుంబ సభ్యులపై అసభ్యపదజాలంతో ట్రోలింగ్ చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. Read more