తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

ABN , First Publish Date - 2022-11-28T12:52:43+05:30 IST

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలకు సీఎం కేసీఆర్ కసరత్తు పూర్తి చేశారు. ఏ క్షణం ఐనా అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

Hyderabad : తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలకు సీఎం కేసీఆర్ కసరత్తు పూర్తి చేశారు. ఏ క్షణం ఐనా అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. నాలుగేళ్లుగా ఒకే పోస్టులో కొందరు ఐఏఎస్‌లు ఉన్నారు. ఎన్నికలకు ఏడాది ముందు కేసీఆర్ పాలన ప్రక్షాళన నిర్వహిస్తున్నారు. బదిలీల తర్వాత కేసీఆర్ కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఒక్కొక్కరికీ రెండు కన్నా ఎక్కువ శాఖల బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. కొన్ని జిల్లాలకు ఇన్‌ఛార్జి కలెక్టర్లను నియమించనున్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని భారీగా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. మంచి అవకాశాలు కోసం ఎదురు చూస్తున్న కొందరు సీనియర్ ఐఏఎస్‌లు ఎదురు చూస్తున్నారు.

Updated Date - 2022-11-28T12:52:44+05:30 IST