చేనేతకు నేనే బ్రాండ్‌ అంబాసిడర్‌

ABN , First Publish Date - 2022-08-08T10:40:53+05:30 IST

భారతీయ కళలు ఎంతో విశిష్ట స్థానాన్ని పొందాయని, అలాంటి వాటిల్లో వారసత్వంగా విరాజిల్లుతున్నదీ..

చేనేతకు నేనే బ్రాండ్‌ అంబాసిడర్‌

వారానికి ఒక్కరోజైనా నేత వస్త్రాలు ధరించండి: పవన్‌

చంద్రబాబు, బాలినేని, లక్ష్మణ్‌కు చేనేత చాలెంజ్‌

అమరావతి, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): భారతీయ కళలు ఎంతో విశిష్ట స్థానాన్ని పొందాయని, అలాంటి వాటిల్లో వారసత్వంగా విరాజిల్లుతున్నదీ.. సృజనాత్మకమైనదీ చేనేత రంగమని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అభిప్రాయపడ్డారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో ప్రతి కుటుంబం వారంలో ఒకసారైనా చేనేత వస్త్రాలు ధరించాలన్న ధృడ సంకల్పాన్ని బలంగా గుండెల్లో నింపుకోవాలని పవన్‌ సూచించారు. చేనేతకు తన జీవితాంతం వారధిగా (బ్రాండ్‌ అంబాసిడర్‌)గా నిలబడతానని పవన్‌ పునరుద్ధాటించారు. చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ విసిరిన చేనేత చాలెంజ్‌ను జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ స్వీకరించారు. ఇందులో భాగంగా పవన్‌ కళ్యాణ్‌ తాను చేనేత వస్త్రాలు ధరించిన ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. అనంతరం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, బీజేపీ నేత లక్ష్మణ్‌ను చేనేత చాలెంజ్‌కు నామినేట్‌ చేశారు.

Updated Date - 2022-08-08T10:40:53+05:30 IST