Super Strar: పద్మాలయ స్టూడియోకి భారీగా తరలి వస్తున్న కృష్ణ అభిమానులు

ABN , First Publish Date - 2022-11-16T10:51:30+05:30 IST

హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) భౌతికకాయాన్ని పద్మాలయ స్టూడియోకి(Padmalaya Studio) తరలించారు.

Super Strar: పద్మాలయ స్టూడియోకి భారీగా తరలి వస్తున్న కృష్ణ అభిమానులు

హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) భౌతికకాయాన్ని పద్మాలయ స్టూడియోకి(Padmalaya Studio) తరలించారు. దీంతో ఆయన పార్థివదేహాన్ని కడసారిగా చూసేందుకు దూరప్రాంతాల నుంచి అభిమానులు పెద్ద ఎత్తు

న తరలి వస్తున్నారు. పోలీసులు కూడా వారిని లోపలికి అనుమతిస్తున్నారు. అభిమానుల సందర్శనార్థం బుధవారం ఉదయం నానక్‌రామ్‌ గూడలోని(Nanakram Guda) కృష్ణ నివాసం నుంచి ఆయన పార్థివదేహాన్ని పద్మాలయ స్టూడియోకి తీసుకెళ్లారు. ఈ మధ్యాహ్నం 12 గంటలకు అంతిమయాత్ర మొదలుకానుంది. కృష్ణ అంత్యక్రియలు బుధవారం హైదరాబాద్‎లోని మహా ప్రస్థానంలో జరగనున్నాయి. ప్రభుత్వ(Telangana Govt) లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.

Updated Date - 2022-11-16T11:01:06+05:30 IST