హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. బీజేవైఎం కార్యకర్తలపై లాఠీఛార్జ్

ABN , First Publish Date - 2022-02-03T02:18:48+05:30 IST

ఉప్పల్ పోలీస్ స్టేషను వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తోన్న బీజేవైఎం కార్యకర్తలపై ..

హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. బీజేవైఎం కార్యకర్తలపై లాఠీఛార్జ్

హైదరాబాద్: ఉప్పల్ పోలీస్ స్టేషను వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తోన్న బీజేవైఎం కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. మంత్రి కేటీఆర్ కాన్వాయ్‎ను అడ్డుకున్న బీజేవైఎం కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. దీంతో బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అరెస్ట్ చేసిన తమ పార్టీ కార్యకర్తలను విడుదల చేయాలని ధర్నాకు దిగారు. ఈ ఘటనతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.  పోలీసులకు, బీజేవైఎం కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు.. బీజేవైఎం కార్యకర్తలపై లాఠీలు ఝులిపించారు. 

Updated Date - 2022-02-03T02:18:48+05:30 IST