19, 20తేదీల్లో హైదరాబాద్‌-తిరుపతి ప్రత్యేక రైళ్లు

ABN , First Publish Date - 2022-07-13T13:47:23+05:30 IST

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నెల 19,20 తేదీల్లో హైదరాబాద్‌- తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు నడుపతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం విడుదల చేసిన

19, 20తేదీల్లో హైదరాబాద్‌-తిరుపతి ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్‌/సికింద్రాబాద్‌: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నెల 19,20 తేదీల్లో హైదరాబాద్‌- తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు నడుపతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. జూలై 19మంగళవారం 18.40గంటలకు ప్రత్యేక రైలు(07433) హైదరాబాద్‌ నుంచి బయలుదేరి మరుస టి రోజు ఉదయం 7.50కు తిరుపతి చేరుకుంటుందన్నారు. జూలై 20న 17.20గంటలకు (రైల్‌ నెంబర్‌: 07434) తిరుపతిలో బయలుదేరి, తర్వాత రోజు 8.40గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటుందని పేర్కొన్నా రు. రైళ్లు నల్లగొండ, గుంటూరు, నెల్లూరు మీదుగా నడుస్తాయి. అలాగే తిరువనంతపురం-సికింద్రాబాద్‌ శబరి ఎక్స్‌ప్రెస్‌ సమయాన్ని ఆగస్టు 16 నుంచి సవరిస్తున్నట్టు రైల్వే అధికారులు పేర్కొన్నారు.

Updated Date - 2022-07-13T13:47:23+05:30 IST