సైబరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు విధింపు
ABN , First Publish Date - 2022-05-24T23:22:38+05:30 IST
సైబరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు విధింపు

హైదరాబాద్: ఎల్లుండి ప్రధాని పర్యటన దృష్ట్యా సైబరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నట్లు పోలీసులు వెల్లడించారు. గచ్చిబౌలి స్టేడియం, త్రిపుల్ ఐటీ జంక్షన్ నుంచి విప్రో జంక్షన్, ట్రిపుల్ ఐటీ జంక్షన్ నుంచి గచ్చిబౌలి వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం లేదా టైమింగ్స్ మార్చుకోవాలని అధికారులు సూచించారు.