‘అంకుల్‌.. రోడ్లను బాగు చేయండి’

ABN , First Publish Date - 2022-03-04T16:49:43+05:30 IST

‘కమిషనర్‌ అంకుల్‌.. గుంతల రోడ్లను బాగు చేయండి’ అని కోరుతూ ఓ చిన్నారి ప్లకార్డు పట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపింది

‘అంకుల్‌.. రోడ్లను బాగు చేయండి’

మీర్‌పేట్‌లో చిన్నారి నిర్విజ్ఞ వినూత్న నిరసన


హైదరాబాద్/సరూర్‌నగర్‌ : ‘కమిషనర్‌ అంకుల్‌.. గుంతల రోడ్లను బాగు చేయండి’ అని కోరుతూ ఓ చిన్నారి ప్లకార్డు పట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపింది. తాను రోజూ స్కూల్‌కు వెళ్లే క్రమంలో గుంతల రోడ్లు ఇబ్బందికరంగా మారాయని, వెంటనే వాటిని బాగు చేసి పుణ్యం కట్టుకోండి అని ఆ చిన్నారి వేడుకుంది. మీర్‌పేట్‌ కార్పొరేషన్‌ 36వ డివిజన్‌లోని ఎంఎల్‌ఆర్‌ కాలనీకి చెందిన మూడేళ్ల తోడేటి నిర్విజ్ఞ ఇదే దారిలో రోజూ స్కూల్‌కు వెళుతూ గుంతలరోడ్లపై అసహనం వ్యక్తం చేసింది. దీంతో ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలనే ఆలోచనతో తండ్రి ప్రసాద్‌ (లోక్‌సత్తా నాయకుడు) కూతురి చేతికి ప్ల కార్డు ఇచ్చి గుంతల రోడ్డు వద్ద నిరసన చేయించారు.

Read more