Hyderabad Modi Tour: హైదరాబాద్‌లో పలుచోట్ల 144 సెక్షన్
ABN , First Publish Date - 2022-06-30T02:46:31+05:30 IST
ప్రధాని మోదీ (Pm Modi) హైదరాబాద్ టూర్ సందర్భంగా పోలీసులు ఆంక్షలు విధించారు. జులై 2,3 తేదీల్లో నగరంలో బీజేపీ (Bjp) జాతీయ కార్యవర్గ సమావేశాలు..
హైదరాబాద్ (Hyderabad): ప్రధాని మోదీ (Pm Modi) హైదరాబాద్ టూర్ సందర్భంగా పోలీసులు ఆంక్షలు విధించారు. జులై 2,3 తేదీల్లో నగరంలో బీజేపీ (Bjp) జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. దాంతో పోలీసులు భద్రతపై దృష్టి సారించారు. 3 కమిషనరేట్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేయనున్నారు. నో ఫ్లయింగ్ జోన్స్‌ను ప్రకటించారు.
హైదరాబాద్ పరిధిలోని పరేడ్‌గ్రౌండ్, రాజ్‌భవన్ (Rajbhavan) పరిసరాలతో పాటు సైబరాబాద్ పరిధిలోని నొవాటెల్ (Novatel) వరకు నో ఫ్లయింగ్జోన్గా ప్రటించారు. డ్రోన్స్ (Drones), రిమోట్ కంట్రోల్డ్ డ్రోన్స్, మైక్రోలైట్ ఎయిర్క్రాప్స్పై నిషేధం విధించారు. ఈ నెల 30 ఉదయం 6 గంటల నుంచి జులై 4 సాయంత్రం 6 వరకు ఆంక్షలు అమలు చేయనున్నారు. ఆంక్షలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.