Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైల్‌ రికార్డు

ABN , First Publish Date - 2022-09-10T20:42:25+05:30 IST

శుక్రవారం హైదరాబాద్ మెట్రో రైల్‌ (Hyderabad Metro) రికార్డు సృష్టించింది. రికార్డు స్థాయిలో నిన్న మెట్రోలో 4 లక్షల మంది

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైల్‌ రికార్డు

హైదరాబాద్: శుక్రవారం హైదరాబాద్ మెట్రో రైల్‌ (Hyderabad Metro) రికార్డు సృష్టించింది. రికార్డు స్థాయిలో నిన్న మెట్రోలో 4 లక్షల మంది ప్రయాణించారు. మియాపూర్- ఎల్‌బీనగర్ (Miyapur- L Bnagar) కారిడార్‌లో 2.46 లక్షల మంది, నాగోల్-రాయదుర్గం కారిడార్‌లో 1.49 లక్షల మంది ప్రయాణించారు. అత్యధికంగా ఖైరతాబాద్ మెట్రోస్టేషన్ ఫుట్, ఫాల్ 62 వేల మంది, ఖైరతాబాద్ స్టేషన్‌లో 40 వేల మంది రైలు దిగారు. ఇదే స్టేషన్‌లో 22 వేల మంది రైలు ఎక్కారు. జేబీఎస్-ఎంజీబీఎస్ కారిడార్‌లో 22 వేల మంది ప్రయాణించారు. గణేష్ నిమజ్జనం నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో సేవలు పొడగించారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అర్థరాత్రి 2 గంటల వరకు మెట్రో రైళ్లను నడిపారు. చివరిస్టేషన్ నుంచి అర్ధరాత్రి ఒంటిగంటకు ఆఖరి రైలు బయలుదేరింది.


Updated Date - 2022-09-10T20:42:25+05:30 IST